Nagoba Jatara | ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మొస్రం వంశీయుల సంప్రదాయ పూజలతో శనివారం నాగోబా జాతర ముగిసింది. మెస్రం వంశీయులు బేతాల్, మండగాజిలింగ్ పూజలతో నాగోబా జాతరకు ఘనంగా ముగింపు పలికారు. ఈ సందర్భంగా గోవాడ్ వద్ద బేతాల్ పూజలు చేసిన పురుషులు, మహిళలు వేర్వేరుగా సంప్రదాయ నృత్యాలు చేశారు. మండగాజిలింగ్ కార్యక్రమంలో సతీక్ దేవతల వద్ద భక్తులు కానుకల రూపంలో వేసిన డబ్బులు, టెంకాయలు, పుట్నాలు, పేలాలు, ప్రమీదలను పటేల్ కిత, కటోడ కిత, ప్రధాన్ కితల వారీగా పంచుకున్నారు. నాగోబా జాతరలో మహాపూజలకు ఉపయోగించిన మట్టికుండలను 22 కితలకు చెందిన మెస్రం వంశీయుల కుటుంబాలకు పంపిణీ చేశారు. అనంతరం కెస్లాపూర్ నుంచి ఉట్నూర్ మండలం శ్యాంపూర్ భుడుందేవ్ పూజల కోసం ఎడ్లబండ్లపై బయలుదేరి వెళ్లారు.