ఇంద్రవెల్లి : ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యధైవం కేస్లాపూర్ నాగోబా జాతరకు ( Nagoba Jatara ) భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిసరాలు కిక్కిరిసాయి . భక్తులు గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరణకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు వారు వెల్లడించారు.

జాతరలోని తినుబండారాల దుకాణాల్లో ప్రజలు వివిధ రకాల స్వీట్ ను కొనుగోలు చేశారు. రంగుల రాట్నల వద్ద యువతీ యువకులు సందడి చేశారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
