ఒకానొక సామూహిక రోదన నుంచి రంగస్థలం ఆవిర్భవించినట్టు గ్రీకు శాస్త్రం తెలిపింది. దీనినే కెథోరిసిస్ (ప్రక్షాళన) అని అభివర్ణించారు. అంతరంగంలో పేరుకుపోయిన దుఃఖాన్ని తెరలు తెరలుగా బహిర్గతంగా రోదిస్తూ వ్యక్
రాఘవయ్య నిఖార్సయిన సగటు రైతు. కాలం కలిసి రాక, పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర లేక, అప్పులపాలై రోడ్డున పడతాడు. కూతురి కాన్పు కష్టమైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె నగలు తాకట్టుపెడతాడు.
కొక్కోరొక్కో’ అంటే మేలుకొలుపు. ఎవరికి మేలుకొలుపు? యువతకు, దేశానికి సంబంధించిన నిరుద్యోగ సమస్య గురించి మేలుకొలుపు. దేశమేదైనా, కాలమేదైనా నడిచే ప్రభుత్వమేదైనా సరైన చేతికి సరైన పని లేకపోతే (చూపలేకపోతే) పేదర�
సుధీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. లేటుగా మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య సౌమ్య ఓ మధ్య తరగతి కుటుంబంలో గారాబంగా పెరిగిన పిల్ల. ఆమెకు వంట చేయడం రాదు. ప్రతి చిన్నదానికీ కంగారుపడుతుంది. భయపడుతుంది.
దివ్య కిషోర్ భార్యభర్తలు. వాళ్లిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఉద్యోగ బాధ్యతల రీత్యా వాళ్లు దాంపత్య జీవితాన్ని అనుభవించడం గగనమవుతుంది. కుటుంబ వృద్ధి కోసం పిల్లలను కనాలనీ, పుట్టిన బిడ్డను అపురూపంగా పెం�
‘అవనిలో సగం... ఆకాశంలో సగం... అన్నిటా సగం సగం’ అంటూ నినదిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈ నినాదం వెనుక యుగయుగాల ధీరోదాత్త చరిత్ర ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినా పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ప్రతిక్షణం పోరాడుతూన
‘డబ్బుకు లోకం దాసోహం గణనాథా.. దాచాలన్నా దాగని సత్యం గణనాథా’ అనే సినిమా పాట డబ్బు కోసం మనిషి ఎంతగా దిగజారతాడో చెబుతుంది. పల్లెటూరి పామర జనంలో సైతం డబ్బు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద మనుషులుగా ముసుగేసు�
వ్యంగ్యం పదునైన కత్తి. రాజకీయ వ్యంగ్యం అయితే.. ఇక చెప్పేదేముంది? వ్యవస్థ మీద వ్యంగ్యాన్ని పట్టుకున్న కవి, రచయిత, కళాకారుడు ఎవరైనా ఆ కత్తిమీద సాము చెయ్యాల్సిందే. కవి కాళోజీ రచనలు నిత్యం మన వెన్నంటే ఉంటూ ఆ చు�
‘తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి..’ ఇది మన తెలుగువారి నానుడి. అంత అద్భుతమైన మహాభారతంలో రసవత్తర ఘట్టం విరాటపర్వం. ఇదే ‘కీచక వధ’గా, ‘నర్తనశాల’గానూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. విరాటపర్వం ఆధారంగా పలు సిని�
‘పరస్పర విరుద్ధ శక్తుల ఘర్షణ నుంచే చరిత్ర జన్మిస్తుంది’ అన్న కారల్ మార్క్స్ వర్గ సిద్ధాంతాన్ని తెలుగు నేలపైకి మొట్టమొదటగా ప్రవేశపెట్టిన సాంఘిక నాటకం ‘ముందడుగు’. శ్రామిక వర్గ ప్రజానీకంపై నాటకం ప్రభా�
సంఘ శ్రేయస్సు కోసమే కొన్ని కట్టుబాట్లు, నీతి నియమాలు పుట్టుకొచ్చాయి. అయితే ఇవేవీ స్థిరంగా ఉండవు. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మార్పు పురోగమనమా? తిరోగమనమా? అనే వివేచన ప్రతి వ్యక్తికీ ఉ�
అబద్ధాలుఆడేటప్పుడు, అసందర్భంగా వ్యవహరించేటప్పుడు జీవితంలోకి అకస్మాత్తుగా నాటకం ప్రవేశిస్తుంది. అందుకే.. రుజువర్తన కంటే అసందర్భ ప్రవర్తనే ఎక్కువగా ఉంటే ‘వాడివన్నీ నాటకాలు’ అంటాం. మనిషిగా ప్రవర్తించే స�
చలం రాసిన ‘వేదాంతం’ కథ ఆలోచనకు పదునుపెట్టే ప్రహేళిక (పజిల్) లాంటిది. స్త్రీ అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి పురుషుడు నిత్యం చేసే విశ్వ ప్రయత్నంగా ఇది గోచరిస్తుంది.
తెరతీయగానే... ఊళ్లో సత్తెమ్మ తల్లి ఎదుట, ఊరి పెద్దలు, ప్రజల ఎదుట.. ‘బుచ్చమ్మ గారి చిన్నబ్బాయి దగ్గర, తొలకరి జల్లుల్లో లక్ష రూపాయల రొక్కం చేబదులు తీసుకున్న మాట నిజం. తర్వాత రెండు నెలలకే నేను ఆ సొమ్ము చిన్నబ్బా