వరద ముంచిన గూడు
పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. అకాల వర్షాలు, అధిక వానలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి.
పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. అకాల వర్షాలు, అధిక వానలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. బతుకు దిన దిన గండం కాదు. క్షణ క్షణ గండం.. నూరేళ్ల ఆయుష్షులా ఉంటుంది. ఆ స్థితికి దర్పణం ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక. ఇది నేడు మనల్ని తరుముతున్న సమస్య.
తుఫాను సంభవించినపుడు, వరదలు ముంచెత్తినపుడు పల్లపు ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. గొడ్డు, గోదా, సామాన్లు.. ఆ వరదపాలైపోతాయి. ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రభుత్వ బాధ్యత. ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదు.
డబ్బు ఏండ్లు దాటిన ఓ వృద్ధ దంపతుల కన్నీటి గాథే ‘మమ్మల్ని బతకనివ్వండి’. ఇద్దరూ తమ ఇంటిని కనిపెట్టుకుని ఒకరికి ఒకరు తోడుగా ఉంటుంటారు. వంట చేసుకుని తినడం, మందులేసుకోవడం, నిద్రపోవడం… ఇదీ వారి దినచర్య. ఆరోగ్యాన్ని అలా కాపాడుకోవడమే వారికి గగనకుసుమమవుతుంది. నొప్పులతో, బాధలతో వృద్ధాప్య జీవితం గడుపుతూ ఉంటారు. వారి పిల్లలు ఉద్యోగాల రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో గడుపుతూ ఉంటారు. వీళ్లు మాత్రం నిరుపేద జీవితం గడుపుతుంటారు. పెన్షన్ డబ్బులతో బతుకును వెళ్లదీస్తుంటారు. అదే వారికి ఆసరా. ఎన్నికలు వస్తాయి. పోటీలో ఉండే అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లకు డబ్బులు పంచుతారు. ‘ఇది అన్యాయం’ అని మనసు చెబుతున్నా అవసరాల కోసం ఆ డబ్బు తీసుకుంటారు. అలా రూ.అయిదు వేలు రొక్కం వారి వద్ద ఉంటుంది.
ఓ రాత్రి.. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కుండపోత వాన కురుస్తుంది. చూస్తుండగానే.. ఆ ప్రాంతమంతా జలమయం అవుతుంది. తలుపులు, కిటికీలు బంధించినా సందుల్లో నుంచి వర్షపు నీరు ఇంట్లోకి చేరుతుంది. బయట ఎడతెరపిలేని కుండపోత వాన… ఈదురు గాలులు… ఇంట్లో నీటి మట్టం క్షణ క్షణం పెరుగుతోంది. ఎలా బతకాలి జీవుడా? బతక గలమా? లేదా? ఆందోళన… ఒకరినొకరు కాపాడుకోవాలనే ఆత్రుత.. ఒకరికొకరు రక్షణ.. కటికి చీకటిలో ఆ రోజు గడిచిపోతుంది. తెల్లవారుతుంది. ఒక కర్రపుల్లకు ఎర్రటిగుడ్డ కట్టి తాము ఇంట్లో ఒంటరిగా ఉన్నామని కిటికీ ద్వారా బయటకు ఓ సంకేతం అందిస్తారు. ప్రజల్ని రక్షించేందుకు పభుత్వ, ప్రైవేట్ హెలికాప్టర్లు, పడవలు రంగంలోకి దిగుతాయి. వీరిని కాపాడేందుకు సిబ్బంది హెలికాప్టర్‌తో వస్తుంది. మనిషికి అయిదు వేల రూపాయలు ఇస్తే వారిని అక్కడి నుంచి బయటికి తీసుకుపోతామని సాయానికి వచ్చిన వాళ్లు నిర్దంద్వంగా చెబుతారు. వృద్ధుడు తన వద్ద ఉన్న అయిదు వేల రూపాయలు ఇచ్చి భార్యను హెలికాప్టర్ ఎక్కిస్తాడు. తర్వాత ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంటాడు. ఆ వెనువెంటనే తనకు దీర్ఘకాలంగా ఉన్న మూర్చవ్యాధి వచ్చి తట్టుకోలేక మరణిస్తాడు.
ప్రారంభంలో సరదాగా గడిచిన ఈ నాటిక పోను పోనూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో నవంబరు 10న తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నాటిక ప్రదర్శించారు. రెండే రెండు పాత్రలు… వరదలు… నీటి ప్రవాహం వంటి స్క్రీన్ షాట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. ‘రానున్న కాలంలో తెలుగు నాటకం స్క్రీన్‌ను షేర్ చేసుకుని సినిమాకు ధీటుగా నిలుస్తుంది’ అని రంగస్థల ప్రయోక్త చాట్ల శ్రీరాములు దశాబ్ద కాలం క్రితం చెప్పిన మాటను కళాకారులు రుజువు చేశారు.
నాటిక పేరు: మమ్మల్ని బతకనివ్వండి
రచన, దర్శకత్వం: సుఖమంచి కోటేశ్వరరావు
పాత్రధారులు: పవన్, రాజేశ్వరి
ప్రదర్శన: సాంస్కృతిక సమితి
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

