Hansika Motwani | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి హన్సికా మోత్వానీ. దేశముదురు సినిమాతో హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ భామ తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.
హన్సిక ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తూనే 2022 డిసెంబర్ 4న జైపూర్‌లో హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన వివాహ వేడుకలో సోహైల్ ఖటురియాతో కలిసి ఏడడుగులు వేసింది. కాగా పరస్పర అంగీకారంతో తాను భర్త నుంచి విడిపోవాలని కోరుతూ హన్సిక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు హన్సికకు విడాకులు మంజూరు చేసింది.
సోహైల్ ఖటురియా, హన్సికా మధ్య అభిప్రాయపరంగా, జీవన శైలి పరంగా చాలా వ్యత్యాసాలున్నాయి. ఇద్దరూ తరచూ గొడవలు పడుతూ ఇక కలిసి ఉండలేమని చెబుతూ వచ్చారు. వారి బంధువులు, తల్లిదండ్రులు ఇద్దరినీ కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. హన్సిక-సోహైల్ జులై 2024 నుంచి విడివిడిగా ఉంటున్నారు. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసిందని హన్సిక తరపు లాయర్ అద్నాన్ షేక్ వెల్లడించారు. హన్సిక భర్త నుంచి ఎలాంటి భరణం డిమాండ్ చేయలేదని సమాచారం.
Vadhala Movie | జగపతి బాబు ‘వదలా’ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్!
Ek Din Trailer | ఆమిర్ ఖాన్ తనయుడితో సాయి పల్లవి రొమాన్స్.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ విడుదల