తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కెన్యా, బురుండీల్లో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నా రు.
అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాలివాన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి ఏ మాత్రం పట్టింపులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ఎర్రటి ఎండలు, పొడి వాతావరణం కనిపించే దుబాయ్ మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల నిత్యం ర
Dubai | నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్ (Dubai)ని భారీ వర్షాలు ముంచెత్తాయి (Heavy Rains). వర్షాల కారణంగా భారత్ - దుబాయ్ మధ్య నడిచే దాదాపు 28 విమానాలు రద్దయ్యాయి (28 India Flights Cancelled).
ఓ వైపు ఎండలు మాడు పగులకొడుతున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి రుతుపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
తెల్లారితే ఉగాది పండుగ. పండుగ ఏర్పాట్లలో మునిగితేలిన రైతులకు అకాల వర్షం తీరని శోకం మిగిల్చింది. చేతికొచ్చిన పంటనంతా నేలరాల్చింది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
Crop damage | ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50 వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి.
మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.