హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హెచ్ఐఎల్టీపీ) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మరోసారి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్యశాఖ గురువారం జీవో జారీ చేసింది.
2026 జూన్ 5కు ముందు అమల్లో ఉన్న ఎస్ఆర్వో రేట్లనే ఈ గడువు పొడిగింపు కా లంలో వర్తింపజేయాలని సూచించింది. పాత నియమ నిబంధనలే ఇప్పుడు కూడా అమలుచేయాలని పేర్కొన్నది.