సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆదివారం గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టిం ది. మారేడ్‌పల్లిలోని న్యూమెట్టుగూడలో రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా 7.75 సెం. మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. వర్షం నీరు కారణంగా లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ముషీరాబాద్ రాంనగర్ ఆదర్శ అపార్టుమెంట్ సమీపంలో వరద నీటి లో కారుతో సహా నలుగురు చిక్కుకుపోయారు.
స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి వారిని కాపాడారు. కాగా, న్యూమెట్టుగూడలో 7.75సెం.మీ, యూసుఫ్‌గూడలో 7.65, ముషీరాబాద్‌లో 7.3, జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో 7.2, హెచ్‌సీయూ, శేరిలింగంపల్లి, మాదాపూర్‌లలో 6.95, నాచారం లో 6.88, సీతాఫల్మండి లో 6.85, ముషీరాబాద్‌లోని తాళ్లబస్తీలో 6.3, బన్సీలాల్‌పేట, మోండా మార్కెట్లలో 6.28, పాటిగడ్డ, బుద్ధానగర్లలో 6.15, ఉప్పల్ చిలుకానగర్ లో6 అల్లాపూర్, ఉస్మానియా యూనివర్సిటీ లలో 5.90, రహ్మత్‌నగర్, భోలక్పూర్లలో 5.73, మౌలాలి, ఓల్డ్ సుల్తాన్నగర్లలో 5. 55, గచ్చిబౌలి, ఉప్పల్‌లలో 5.40, ఖైరతాబాద్, బేగంపేట, షేక్పేటలలో 5.20 సెం. మీల వర్షపాతం నమోదైంది. ఆవర్తనం ప్రభావంతో రాగల మరో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు.