NEP vs SCO : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించిన నేపాల్(Nepal) ఎట్టకేలకు విజయగర్జన చేసింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తేరుకొని.. చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్కు దిమ్మతిరిగే షాకిచ్చింది. 174 పరుగుల ఛేదనలో ఓపెనర్లు శుభారంభమివ్వగా. దీపేంద్ర సింగ్ ఐరీ(50 నాటౌట్).. గుల్షన్ ఝా(24 నాటౌట్)లు చితక్కొట్టారు. ఆఖరి ఓవర్లో 5 పరుగులు అవసరమవ్వగా.. ఉత్కంఠ పోరులో స్కాట్లాండ్కు ఝలక్ ఇస్తూ సంచలన విజయంతో బోణీ కొట్టి.. మెగా టోర్నీకి విజయం తో వీడ్కోలు పలికింది.
ప్రపంచకప్ ముందే వెస్టిండీస్‌ను ఓడించి సంచలనం సృష్టించిన నేపాల్ మెగా టోర్నీలోనూ విజయఢంకా మోగించింది. ఇంగ్లండ్‌పై ఎదురైన చేదు ఓటమిని దిగమింగిన.. ఆసియా జట్టు ఆఖరి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై పంజా విసిరింది. పట్టుదలతో ఆడి.. ప్రత్యర్థిని బెంబేలెత్తించి 7 వికెట్ల తేడాతో తొలి విజయంతో మురిసిపోయింది. భారీ ఛేదనలో ఓపెనర్లు ఆసిఫ్ షేక్(33), కుషాల్ భుర్తెల్(43)లు ధాటిగా ఆరంభించారు. మార్క్ వ్యాట్‌కు చుక్కలు చూపిస్తూ.. 4, 6, 6, 6తో 23 రన్స్ పిండుకున్నారు. తొలి వికెట్‌కు 74 రన్స్ జోడించి ఈ ద్వయాన్ని లీస్క్ విడదీశాడు.
23-BALL FIFTY FOR DIPENDRA SINGH AIREE!
Nepal need 4 runs from 5 balls… pic.twitter.com/2LKUokRMQS
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026
కాసేపటికే లీస్క్ రోసారి షాకిస్తూ ఓపెనర్ ను వెనక్కి పంపాడు. సాధించాల్సిన రన్‌రేటు పది దాటింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన దీపేంద్ర సింగ్ ఐరీ(50 నాటౌట్)… రోహిత పౌడెల్(16) పోరాడారు. కెప్టెన్ ఔటయ్యాక గుల్షన్ సింగ్(24 నాటౌట్), ఐరీలు గెలుపు బాధ్యత తీసుకున్నారు. 16వ ఓవర్ చివరి బంతికి గుల్షన్ సిక్సర్ బాదగా.. ఐరీ వరుసగా రెండు సిక్సర్లు సంధించాడు. ఆ తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు రాగా.. బ్రాడ్ వీల్ ఓవర్లో గుల్షన్ వరుసగా 4, 6 బాదడంతో మ్యాచ్ నేపాల్ వైపు మళ్లింది. ఆఖరి ఓవర్లో 5 పరుగులు అవసరమవ్వగా తొలి బంతికి సింగిల్, రెండో బంతికి గుల్షన్ బౌండరీ కొట్టాడు. అంతే.. ప్రపంచకప్‌లో తొలి విజయంతో నేపాల్ రికార్డు నెలకొల్పింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన ఐరీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
చివరి లీగ్ మ్యాచ్‌లో మొదట స్కాట్లాండ్ బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ జార్జ్ మున్సే(27) రాణించగా.. మైఖేల్ జోన్స్(71)అర్ధ శతకంతో పునాది వేశాడు. జోన్స్, బ్రాండన్ మెక్‌ముల్లెన్( 25)ల విజృంభణతో భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే.. నేపాల్ బౌలర్లు చకచకా వికెట్లు తీసి సోర్ వేగానికి కళ్లెం వేశారు. సోంపాల్ కమ్లీ(3-25) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో నిర్ణీత ఓవర్లలో 173 రన్స్ చేసింది స్కాట్లాండ్.
Sompal Kami inspires Nepal’s fightback as Scotland slide from 132/1 to finish on 170/7 – who will end their tournament with a win?
Follow the chase: https://t.co/hiPk8LZy3Q pic.twitter.com/WdVEqLCS68
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026