KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా చేసిన ప్రకటనల్లో వారు ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు రాజకీయ పార్టీల నేతలు, సినీ తారలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, కేంద్ర మంత్రి బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, విజయ సాయి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తదితరులు ఉన్నారు.
కాగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
హ్యాపీ బర్త్ డే సర్!💐
కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్ గారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
వీరిలో.. తెలంగాణ, ఆంధ్ర… pic.twitter.com/cTBE1V5Rd2
— BRS Party (@BRSparty) February 17, 2026
KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Veenavanka | వీణవంకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో