ధరూరు/అయిజ, జూలై 15 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు(Jurala project) సోమవారం ఎగువ నుంచి 2,894 క్యూసెక్కుల వరద(Flood) వస్తుండగా.. 1,806 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 656, భీమా లిఫ్ట్-1కు 650, ఎడమ కాల్వకు 390, భీమా లిఫ్ట్-2కు 766 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 4.014 టీఎంసీలు ఉన్నది. అలాగే, కర్ణాటకలోని టీబీ డ్యాంకు 15,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 211 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. డ్యాం గరిష్ఠ స్థాయి నీటి నిల్వ 105.855 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 33.074 టీఎంసీల నిల్వ ఉన్నది.