BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేయనుంది. స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగే సమయంలో పాన్ మసాలా (Pan Msala)కు సంబంధించిన హోర్డింగ్స్‌ను ప్రదర్శించొద్దని బీసీసీఐని కోరనుంది. ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులు (Tobacco Products), పాన్ మసాలా కంపెనీ యాడ్స్‌ను ఇకపై స్టేడియంలో చూపించొద్దని భారత బోర్డుకు గట్టిగానే చెప్పనుంది. దేశంలోని కోట్లాది మంది యువత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఓ అధ్యయనం పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించిసంచలన విషయం వెల్లడించింది. నిరుడు మ్యాచ్‌ల వన్డే వరల్డ్ కప్ సమయంలో 41.3శాతం ఇటువంటి నిషేధిత పొగాకు ఉత్పత్తుల యాడ్స్‌ను హోర్డింగ్స్‌లో చూపించారట. మెగా టోర్నీ ఆఖరి17 మ్యాచుల్లో పాన్ బహర్ (Pan Bahar), విమల్, కమలా పసంద్ (Kamala Pasand) వంటి గుట్కా కంపెనీల ప్రకటనలను పెద్ద పెద్ద హోర్డింగ్స్‌లో ప్రదర్శించారని సర్వే నివేదక స్పష్టం చేసింది.
పొగాకు, సిగరెట్ ఉత్పత్తుల చట్టం, కేబుల్ టీవీ నెట్వర్క్ నియమాలు, 1995 ప్రకారం పొగాక, పాన్ మసాలా వంటి యాడ్స్‌ను చూపించడంపై నిషేధం ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో సైతం ఈ యాడ్స్‌ను ప్రసారం చేయడానికి వీల్లేదు. అయితే.. క్రికెట్ స్టేడియాల్లో మాత్రం యథేచ్చగా టొబాకో యాడ్స్‌ను చూపిస్తున్నారు. దాంతో, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని బీసీసీఐకి ఇలాంటి ప్రకటనలు చెప్పనుంది.
‘క్రికెట్ మ్యాచ్‌లంటే యువతకు క్రేజ్. స్టేడియాల్లోని హోర్డింగ్స్‌లో సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్న పొగాకు ఉత్పత్తుల యాడ్స్ చూపిస్తున్నారు. దాంతో ఆ యాడ్స్ ప్రభావం పరోక్షంగా యువతపై పడుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలోనే బీసీసీఐతో మాట్లాడి మపాన్ మసాలా యాడ్స్‌ను ఆపేయాల్సిందిగా కోరనుంది’ అని పత్రికతో ఓ అధికారి మింట్ వెల్లడించాడు.