Ponnam Prabhakar | భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో 75వ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సంజయ్ గాంధీ పిలుపునిచ్చారని.. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. పట్టణంలో ఇంటింటికీ అవసరమైన పండ్లు ఇతర అవసరమైన ఆరు మొక్కలు అందజేస్తామన్నారు.
ఆయా మొక్కలను నాటి కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాల్లో 43లక్షల మొక్కలు టార్గెట్గా పెట్టుకున్నారని.. టార్గెట్గా పెట్టుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలని.. అది మనలో అంశం కావాలన్నారు. ప్రభుత్వ ప్రకారంగా మొక్కలు పంపిణీ జరుగుతుందని.. ఎన్ని చేసిన ప్రజల సహకారం కావాలన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ తేవడంతోపాటు ఉపాధి కోర్స్ తెచ్చానన్నారు. ఈ బిల్డింగ్ కట్టిన ప్రాంతం కాకుండా మిగిలిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటి కాపాడుకునే బాధ్యత సిబ్బంది, విద్యార్థులదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని.. మన జీవితంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. సమాజంలో రేపటి తరానికి కాలుష్యం రాకుండా ఉండేందుకు మొక్కలు నాటాలన్నారు.
వ్యాధులు రాకుండా ఉండాలంటే మొక్కలు నాటాలన్నారు. కొన్ని మొక్కలు నాటితే చెట్టు మీద పిట్ట వాలదని.. గుడు పెట్టదని.. శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని అంటున్నారన్నారు. అలాంటి మొక్కలు కాకుండా.. అటవీశాఖ పర్యవేక్షించాక మొక్కలు నాటాలని.. మొక్కలు నాటితే శ్వాస రావాలి పిట్టలు రావాలని.. పండ్లు రావాలన్నారు. గతంలో జరిగిన పొరపాటు మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. మొక్కల నాటే కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజలు సామాజిక బాధ్యతగా భవిష్యత్ తరాన్ని కాపాడాలన్నారు.