వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్’. సంజీవ్ మేగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ప్రేమ ఓ ప్రేమ’ అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఈ పాటను లాంచ్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ మేలుకలయికగా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలకూ నచ్చుతుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. రాగిణి ద్వివేది, కృష్ణసాయి, ఆదిత్య ఓం, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈచిత్రానికి కెమెరా: ఎస్.ఎన్.హరీష్, సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియా, నిర్మాణం: ఎంఎస్కే ప్రమిదశ్రీ ఫిల్మ్స్.