KTR | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గౌడన్నల పట్ల సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ప్రవర్తించాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గంటల తరబడి గౌడన్నలను చెట్ల మీద ఉంచడం సరికాదన్నారు.
మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడు అని నిప్పులు చెరిగారు కేటీఆర్. గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం అని ధ్వజమెత్తారు. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్‌లో ఉంటుంది అని మీ మతిలేని చర్యలు చూసి తెలంగాణ ప్రజలకు అర్థమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
తాటిచెట్టుపై నుంచి పడి ప్రతి సంవత్సరం ఎంతోమంది కల్లుగీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వాటి నివారణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సేఫ్టీ మోకులు రూపొందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బీసీ సంక్షేమశాఖకు బాధ్యతలు అప్పగించి దాదాపు రూ. 8 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమశాఖ ఆ బాధ్యత ను ఓ ఏజెన్సీకి అప్పగించింది.
ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఆ ఏజెన్సీ సేఫ్టీ మోకులను రూపొందించింది. అప్పుడే వాటిని పంపిణీ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు ‘కాటమయ్య రక్షణ కిట్లు’ పేరిట కాం గ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవి అవే. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి అందించాలని ల క్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో సేఫ్టీమోకు రూ. 9 వేలపైనే ఉంటుందని అధికారులు తెలిపారు.
మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడు!
గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం!
మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే
ప్రచారం పీక్‌లో ఉంటుంది
అని మీ మతిలేని చర్యలు చూసి
తెలంగాణ… pic.twitter.com/EqD06spjhJ— KTR (@KTRBRS) July 15, 2024
ఇవి కూడా చదవండి..
KTR | రాజారాం యాదవ్ సహా విద్యార్థి నాయకుల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
Chalo Secretariat | సచివాలయాన్ని ముట్టడించిన బీసీ జనసభ కార్యకర్తలు.. రాజారాం యాదవ్ అరెస్ట్
Chalo Secretariat | నిరుద్యోగుల మార్చ్.. పోలీసుల గుప్పిట్లో సచివాలయం
KTR | ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కేటీఆర్