KTR | రాజారాం యాదవ్ సహా విద్యార్థి నాయకుల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
KTR | నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల థృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్భంధం పెడతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | హైదరాబాద్ : నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల థృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్భంధం పెడతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటేరియేట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటాన్ని కేటీఆర్ ఖండించారు. రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని నమ్మబలికిన సర్కార్ ఇప్పుడు వారిని గాలికి వదిలేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకురావటం, శాంతియుతంగా ఆందోళన చేయటం కూడా ఈ ప్రజాపాలన నిషేధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం అణిచివేత ధోరణిని సాగిస్తుందని ఇది ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన రాజారాం యాదవ్ సహా మిగతా విద్యార్థి నాయకులందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వారిని ఇప్పుడు పట్టించుకోవటం మానేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించకుంటే ఏ నిరుద్యోగులను రెచ్చగొట్టి గద్దెనెక్కారో ఇప్పుడు వాళ్లే ఈ ప్రభుత్వం పతనానికి కారణమవుతారన్నారు. నిరుద్యోగ డిమాండ్లను పరిశీలించకుండా ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి అవలంభిస్తే తప్పకుండా బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
సెక్రటేరియట్ వద్ద ఆందోళన
డీఎస్సీని వాయిదా వేసి, ఉద్యోగ నియామక క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు pic.twitter.com/usvpyP3Syc
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024
ఇవి కూడా చదవండి..
Chalo Secretariat | సచివాలయాన్ని ముట్టడించిన బీసీ జనసభ కార్యకర్తలు.. రాజారాం యాదవ్ అరెస్ట్
Chalo Secretariat | నిరుద్యోగుల మార్చ్.. పోలీసుల గుప్పిట్లో సచివాలయం
KTR | ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- DSC Aspirants
- group-2
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

