సర్కార్ అప్పుల వేట!
- రూ.2,500 కోట్ల సమీకరణకు ఇండెంట్
- రూ.55 వేల కోట్లకు రాష్ట్ర రుణ సమీకరణ
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పరంపర ఆగడం లేదు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల రుణాలు సమీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.2,500 కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 1న ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రెండు విడతల్లో రూ.1,000 కోట్లు, రూ.1,500 కోట్లు సమీకరించేందుకు ఇండెంట్ పెట్టినట్టు ఆర్బీఐ తెలిపింది. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వేలాల ద్వారా ప్రభుత్వం సమీకరిస్తున్న మొత్తం అప్పులు రూ. 57,400 కోట్లకు చేరనున్నాయి.
రాష్ట్ర వార్షిక రుణ పరిమితి రూ.61,457.16 కోట్లలో ఇప్పటికే 93.4 శాతం వినియోగించినట్టవుతుంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు ఉండగానే వార్షిక రుణ పరిమితిలో 93 శాతానికి పైగా వినియోగించడం ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. మిగిలిన నెలల్లో ప్రభుత్వానికి అదనపు నిధుల అవసరాలు ఏర్పడితే ఎలా సమకూర్చుకుంటుందన్నది కీలకంగా మారింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పాత బకాయిల చెల్లింపులకు నిధులు అవసరమైన తరుణంలో ప్రభుత్వం వరుసగా అప్పులపై ఆధారపడుతున్నది. తీసుకుంటున్న రుణాలు ఏయే రంగాలకు ఖర్చు చేస్తున్నారనే అంశంపైనా స్పష్టత ఇవ్వాలని ఆర్థిక నిఫుణులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

