DSC Hall Ticket | పరీక్ష తేదీ సమీపిస్తున్నది.. డీఎస్సీ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: పాఠశాల విద్యాశాఖ
డీఎస్సీ పరీక్ష తేదీ సమీపిస్తున్నదని, ఇప్పటికీ హాల్టికెట్లు (DSC Hall Ticket) పొందని వారు త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని ఉద్యోగార్థులను ప్రభుత్వం కోరింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
హైదరాబాద్: డీఎస్సీ పరీక్ష తేదీ సమీపిస్తున్నదని, ఇప్పటికీ హాల్టికెట్లు (DSC Hall Ticket) పొందని వారు త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని ఉద్యోగార్థులను ప్రభుత్వం కోరింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోనివారు అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.in నుంచి తీసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా, ఓ పక్క పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు పోరాటం చేస్తుంటే.. విద్యాశాఖ మాత్రం హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
అయితే ప్రభుత్వం విడుదల చేసిన హాల్టికెట్లు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నది. అడ్మిట్ కార్డుల్లో తప్పులు ఉండటంతో ఉద్యోగార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఒకే అభ్యర్థికి ఒకే రోజు రెండు పరీక్షలు ఉండగా, అతనికి రెండు వేర్వేరు కేంద్రాలను కేటాయించారు. ఇక ఒక జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి మరో జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు, అక్కడ ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన శ్రీపెల్లి జ్యోత్స్నఅనే అభ్యర్ధి.. మంచిర్యాల జిల్లాలో ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. అందులో నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఉంది. ఇక పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా మావలలో కేటాయించారు.
కాగా, మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున జరగనున్నాయి. 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, ప్రత్యేక కేటగిరీలో (స్పెషల్ ఎడ్యుకేషన్) 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

