Chalo Secretariat | సచివాలయాన్ని ముట్టడించిన బీసీ జనసభ కార్యకర్తలు.. రాజారాం యాదవ్ అరెస్ట్
రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తక కొనసాగుతున్నది. నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి (Chalo Secretariat) పిలుపులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరుద్యోగలు, జనసభ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది.
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తక కొనసాగుతున్నది. నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి (Chalo Secretariat) పిలుపులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరుద్యోగలు, జనసభ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. సెక్రటేరియట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీసీ జనసభ కార్యకర్తలను పోలీసులు పట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తింతి.
జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సహా కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో డీఎస్సీని వాయిదా వేయాలని రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదావేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సెక్రెటేరియట్ పోలీసుల వలయంలోకి వెళ్లింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరానున్న నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులును మోహరించారు. బాహుబలి బారికేడ్లు, ఇనుపకంచెలు, వాటర్ క్యానన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి సచివాలయ ముట్టడికి తరలివస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

