BJP’s Rajya Sabha Tally Dips | రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం.. మెజార్టీ మార్కుకు తక్కువగా ఎన్డీయే సభ్యులు
BJP's Rajya Sabha Tally Dips | రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది. (BJP's Rajya Sabha Tally Dips) ఎన్డీయే బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12 దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు తగ్గింది. అలాగే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే బలం కూడా 101కు పడిపోయింది.
న్యూఢిల్లీ: రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది. (BJP’s Rajya Sabha Tally Dips) ఎన్డీయే బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12 దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యులైన రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జెఠ్మలానీ పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు తగ్గింది. అలాగే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే బలం కూడా 101కు పడిపోయింది.
కాగా, రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం మెజారిటీ మార్కు 113. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే బలం (101) మెజార్టీ మార్కు కంటే 12 తక్కువగా ఉంది. అయితే ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమి బలం 87గా ఉంది. కాంగ్రెస్‌కు 26, బెంగాల్‌లోని అధికార తృణమూల్‌కు 13, ఆప్‌కు 10 మంది, డీఎంకేకు పది మంది సభ్యులున్నారు.
మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీయేతర పార్టీలపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది. ఒడిశాకు చెందిన బీజేడీకి 9 మంది సభ్యులున్నారు. అయితే బీజేడీ ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకిస్తోంది. అలాగే నలుగురు సభ్యులున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కూడా మద్దతు నిరాకరించే పరిస్థితిలో ఉంది.
కాగా, 11 మంది సభ్యులున్న ఏపీలోని వైఎస్ఆర్సీపీ, నలుగురు సభ్యులున్న తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. అయితే బిల్లుల అంశంలో ఈ రెండు పార్టీలు, స్వతంత్ర ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశముంది. అలాగే బీజేపీ నామినేట్ చేసిన 12 మంది సభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో వీరి సహాయంతో బిల్లులను ప్రభుత్వం ఆమోదించే వీలుంది. రాజ్యసభలో ప్రస్తుతం 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Dips
- Falls
- Majority mark
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

