Shankaracharya of Jyotirmath : ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంపై జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముఖ్తేశ్వరానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన వద్దకు వచ్చి ప్రణామం చేశారని అన్నారు. తమ దగ్గరికి వచ్చిన వారిని ఆశీర్వదించడం తమ బాధ్యతని చెప్పారు.
అవిముఖ్తేశ్వరానంద్ సోమవారం ముంబైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మోదీ తమ శత్రువేమీ కాదని అన్నారు. తాము ఆయన మేలు కోరేవారమని చెప్పారు. మోదీ ఎలాంటి తప్పు చేసినా అప్పుడు కూడా తాము వారిని వేలెత్తి చూపుతామని స్పష్టం చేశారు.
కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముంబైకి వచ్చిన సందర్భంగా స్వామి అవిముఖ్తేశ్వరానంద్ను కలిశారు.
Read More :
Money Savings | మీకు హాయిగా నిద్ర పట్టాలా.. అయితే డబ్బులు పొదుపు చేయండి!