Money Savings | లండన్, జూలై 14: డబ్బుతో సంతోషాన్ని కొనలేం.. కానీ, ప్రతి నెలా ఎంతో కొంత పొదుపు చేయటం భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తుంది. అలా డబ్బులు పొదుపు చేసే వారికి హాయిగా నిద్ర పడుతుందని, చక్కగా రిలాక్సవుతారని ‘బ్రిస్టల్ యూనివర్సిటీ’ అధ్యయనం వెల్లడించింది. సేవింగ్స్కూ, స్లీపింగ్కూ సంబంధం ఉన్నదని పేర్కొన్నది. ‘యాక్ట్ ఆఫ్ సేవింగ్’పై సర్వే నిర్వహించగా ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
ఆర్థిక నేపథ్యం, తాము ధనవంతులా? పేదలా? అన్నదాంతో సంబంధం లేకుండా, ప్రతి నెలా పొదుపు చేసేవారిలో ఒకే విధమైన సంతృప్తి స్థాయిలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. పొదుపు చేయకపోవటం.. తమను ఎంతగానో అసంతృప్తికి గురిచేసేదని గత పదేండ్లుగా పొదుపు పాటిస్తున్న కొంతమంది సర్వేలో చెప్పారు.