Fake Doctor | సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం చోరీ
Fake Doctor | సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది. వైట్ కోట్ వేసుకుని డాక్టర్లా నటించి.. పేషెంట్లను బురిడీ కొట్టించింది. ట్రీట్మెంట్ పేరుతో ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం అపహరించింది.
Fake Doctor | సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది. వైట్ కోట్ వేసుకుని డాక్టర్లా నటించి.. పేషెంట్లను బురిడీ కొట్టించింది. ట్రీట్మెంట్ పేరుతో ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం అపహరించింది.
అనారోగ్యంతో ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నది. ఇవాళ డిశ్చార్జి కావాల్సి ఉంది. ఈ క్రమంలో ట్రీట్మెంట్ పేరుతో పేషెంట్ గదిలోకి వెళ్లిన నకిలీ డాక్టర్.. ట్రీట్మెంట్ పేరుతో రోగి బంధువులను బయటకు పంపించింది. అనంతరం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒంటిపై ఉన్న 10 తులాల బంగారం అపహరించింది. అనంతరం అక్కడి నుంచి జారుకుంది. కాసేపటికి రోగి బంధువులు లోపలికి వెళ్లి చూడగా ఒంటిపై బంగారం కనిపంచకపోవడంతో ఆందోళన చెందారు. దీనిపై యాజమాన్యాన్ని సంప్రదించగా.. ఆమె ఎవరో తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫేక్ డాక్టర్ కలకలం నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నర్సింగ్ స్టాఫ్ రూమ్ వద్ద సీసీ కెమెరాల్లో నకిలీ డాక్టర్ కదలికలు రికార్డయ్యాయి. తెలిసిన వ్యక్తేనా? లేక బయటి వ్యక్తినా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

