Inter Student | ప్రేమ పేరుతో మైనర్ బాలికలను ఓ ఇంటర్ విద్యార్థి మోసం చేశాడు. వారిని లొంగదీసుకుని కోరిక తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా చేయించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి పలువురు బాలికలను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఆమె కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంటర్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతని మొబైల్లో పలువురు బాలికలపై అత్యాచారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కొల్లాపూర్‌లోని సాయి కృప ఆస్పత్రిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు
ప్రేమ పేరుతో పలువురు మైనర్ బాలికలను మోసం చేసి అఘాయిత్యాలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
తన మొబైల్ ఫోన్లో అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
ఈ ఘటనలో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చగా.. కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్… pic.twitter.com/XwUGZlsof3
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026