సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 16:22:29

కేఎల్ రాహుల్ డకౌట్‌

కేఎల్ రాహుల్ డకౌట్‌

సిడ్నీ:  మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా  ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ డకౌటయ్యాడు.  మాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతిని భారీ షాట్‌కు యత్నించిన రాహుల్‌...స్టీవ్‌  స్మిత్‌ చేతికి చిక్కాడు. వేగంగా ఆడే క్రమంలో రాహుల్‌ వికెట్‌ చేజార్చుకున్నాడు.    వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(21)‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నాడు.  

7 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ(34) స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు.  భారత్‌ విజయానికి ఇంకా 78 బంతుల్లో 126  చేయాల్సి ఉంది.