e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

న్యూఢిల్లీ : అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్ ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గ‌జం ఎల్ఎంవీహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ ను అధిగ‌మించి ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా మ‌రోసారి నిలిచారు. కంపెనీ షేర్లు ఎగ‌బాక‌డంతో సోమ‌వారం అర్నాల్ట్ 186.4 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో జెఫ్ బెజోస్ (186 బిలియ‌న్ డాల‌ర్లు)ను వెన‌క్కినెట్టి ఫోర్బ్స్ బిలియ‌నీర్ల జాబితాలో నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ సాధించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎల‌న్ మ‌స్క్ 147.3 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో మూడో స్ధానంలో కొన‌సాగారు. అర్నాల్ట్ ముచ్చ‌ట కేవ‌లం ఒక రోజులోనే ముగ‌సింది.

జెఫ్ బెజోస్ సంప‌ద మంగ‌ళ‌వారం ఏకంగా 313 మిలియ‌న్ డాల‌ర్లు పెర‌గ‌డంతో 189.2 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో బెజోస్ అర్నాల్ట్ ను (189.1 బిలియ‌న్ డాల‌ర్లు) అధిగ‌మించి తిరిగి ప్ర‌పంచ కుబేరుడిగా నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని తిరిగి అందుకున్నారు. ఇక 155.1 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ఎల‌న్ మ‌స్క్ ప్ర‌పంచ కుబేరుల జాబితాలో టాప్ 3 స్ధానంలోనే కొన‌సాగారు. గ‌త ఐదేండ్లుగా బెజోస్ నిక‌ర సంప‌ద స‌గ‌టున 34 శాతం పెరుగుతుండ‌టం విశేషం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

ట్రెండింగ్‌

Advertisement