బీఆర్ఎస్ నేతల నిరసన
జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగో పాల్‌తోపాటు మరో ఇద్దరు నాయకులను పోలీసు లు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీనిని నిరసిస్తూ శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు తిమ్మాజిపేటకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను సైతం దహనం చేశారు.
- తిమ్మాజిపేటలో అర్ధగంటసేపు రాస్తారోకో
- సీఎం పర్యటన నేపథ్యంలో అరెస్టులపై ఫైర్
- అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలింపు
తిమ్మాజిపేట, జూన్ 5 : జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగో పాల్‌తోపాటు మరో ఇద్దరు నాయకులను పోలీసు లు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీనిని నిరసిస్తూ శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు తిమ్మాజిపేటకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను సైతం దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా పక్కకుబెట్టి కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తున్నదని ఆరో పించారు. నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల బాటకు పిలుపునివ్వడంతో సీఎం హడావుడిగా ప్రాజెక్టుల పర్యటనకు పూనుకున్నారని, ఆయన ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదని, ఇప్పుడు వచ్చి ప్రాజెక్టును చూసిపోయినంత మాత్రానా ఏం ప్ర యోజనం అన్నారు.
సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, వెంకట స్వా మి, జైపాల్‌రెడ్డి, హుస్సేనీ, కిల్లె మల్లయ్య, మోహ నాచారి, పరంధాములుగౌడ్, రాజు, భక్తవత్సలం, స్వామి, తారాసింగ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

