ముఖ్యమంత్రి పర్యటనతో నడిగడ్డకు ఒరిగిందేమీ లేదు
ముఖ్యమంత్రి పర్యటన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి తప్పా నడిగడ్డకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుంతునాయుడు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు.
- సీఎం పర్యటన గద్వాల ప్రజలను నిరాశ పరిచింది
- 25 నిమిషాల పర్యటనకు అంత ఆత్రుత ఎందుకు?
- బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతునాయుడు
గద్వాల, జూన్ 5 : ముఖ్యమంత్రి పర్యటన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి తప్పా నడిగడ్డకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుంతునాయుడు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. గద్వాలకు సీఎం వస్తున్నాడంటే అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతాయని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. నిధులు విడుదల చేస్తాడని, ఆగి పోయిన పథకాలు తిరిగి ప్రారంభమవుతాయని అందరూ భా వించారని కానీ ఏమి మాట్లాడకుండా వెళ్లి పోవడం గద్వాల ప్రజలను నిరాశ పర్చినట్లు అయిందన్నారు.
గద్వాల నియోజకవర్గంలో 25నిమిషాల పర్యటనకు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ఎందుకు అంత అత్రుతం చేశా రో అర్థం కావడం లేదన్నారు. గుడ్డెందొడ్డి పంపుహౌస్ను పరిశీలించిన ము ఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన వీడి యో ప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో చూ డకుండా మధ్యలోనే లేచి వెళ్లి పోవడం తో నడిగడ్డపై సీఎంకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన టూరిస్టులా ఇలా వ చ్చి అలా వెళ్లినట్టు ఉందన్నారు. నడిగడ్డ ప్రజలపై ముఖ్యమంత్రికి ఎంత ప్రే మ ఉందో నిన్న పర్యటనతో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నా యకులు తమ ఉనికి కాపాడుకోవడం కోసమే ముఖ్యమంత్రి పర్యటన చేయించారు తప్పా నిధులు, అభివృద్ధిపై కాద ని అభిప్రాయపడ్డారు. ఇంత దూరం వచ్చి కనీసం పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించక పోవడం ఏమిటని ప్రశ్నించారు.
నియోజకవర్గలో ర్యాలంపాడ్, గట్టు, నెట్టెంపాడ్ ప్రాజెక్టు పెండింగ్ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే తప్పా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండి పోయాయన్నా రు. ఆ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఎం దుకు స్పందించలేదని ప్రశ్నించారు. గట్టు ఎత్తిపోతల పనులు నిలిచి పోయి నా దానిపై ముఖ్యమంత్రి స్పందించక పోవడం బాధాకరమన్నారు. సమావేశంలో నాయకులు రాఘవేంద్రరెడ్డి, ప్రతాప్, బీచుపల్లి, వెంకటేశ్నాయుడు, శేఖర్నాయుడు, చక్రధర్రెడ్డి, భరత్, తిమ్మప్పాంజనేయులు, శ్రీను, లక్ష్మారెడ్డి ,గోవిందు, సవారి, వీరేశ్, రాజు, నరింహులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

