వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!
- రేపు జీఎస్టీ మండలి భేటీ
- కరోనా ఉద్ధృతిలోనూ మెడికల్ ఉత్పత్తులపై తప్పని ట్యాక్స్ భారం

న్యూఢిల్లీ, మే 26: కరోనా ఉద్ధృతిలోనూ మెడికల్ ఉత్పత్తులపై పన్ను భారం తప్పట్లేదు. శుక్రవారం జీఎస్టీ మండలి సమావేశం జరుగనుండగా, కొవిడ్-19 బాధితులకు పెద్దగా ఉపశమనం దక్కే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. వ్యాక్సిన్లతోపాటు పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు, వెంటిలేటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, ఆర్టీ-పీసీఆర్ మెషీన్లు తదితర ఇతర వైరస్ రిలీఫ్ ఉత్పత్తులపై పన్నులు యథాతథంగా ఉండొచ్చని సమాచారం. ఆయా వస్తూత్పత్తులు, సేవలపై పన్ను శ్లాబుల మార్పునకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్‌కు సలహాలిచ్చే ఫిట్మెంట్ కమిటీ వీటి తగ్గింపునకు సిఫార్సు చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. వ్యాక్సిన్లు, పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులపై కనిష్ఠంగా 5 శాతం జీఎస్టీనే పడుతున్నందున కమిటీ వీటి జోలికి వెళ్లలేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
మెడికల్ ఆక్సిజన్ చౌక?
మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు/జనరేటర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లపై పన్నులు తగ్గే వీలున్నట్లు తెలుస్తున్నది. వీటిపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ పడుతున్నది. దీంతో 5 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. అయితే టెస్టింగ్ కిట్లు మినహా మిగతా వాటిపై కొత్త రేట్లు జూలై 31 నుంచి అమల్లోకి రానుండగా, కిట్లపై మాత్రం ఆగస్టు 31 నుంచి వర్తించనుందని సమాచారం. కాగా, వెంటిలేటర్లపై 12 శాతం, హ్యాండ్ శానిటైజర్లు, ఆర్టీ-పీసీఆర్ మెషీన్లు, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మెషీన్లు, టెంపరేచర్ చెక్ పరికరాలపై 18 శాతం చొప్పున జీఎస్టీ విధిస్తున్నారు. అంబులెన్స్ సర్వీస్‌లపై 28 శాతం, పోర్టబుల్ హాస్పిటల్ యూనిట్లపై 18 శాతం జీఎస్టీ ఉండగా, జీనోమ్ స్కెన్సింగ్ కిట్ల మెషీన్లపై 12-18 శాతం, స్పెసిఫైడ్ ఇన్ప్లమెటరీ డయాగ్నస్టిక్ కిట్‌పై 12 శాతం జీఎస్టీ ఉన్నది.
పన్ను ఎత్తేయలేరా?
ప్రస్తుత భయానక పరిస్థితుల మధ్య వ్యాక్సిన్లపై పన్ను ఎత్తేయలేరా? అన్న ప్రశ్న సామాన్యుడి దగ్గర్నుంచి నిపుణుల వరకు గట్టిగా వినిపిస్తున్నది. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషనే మార్గమని అంతా చెప్తున్న నేపథ్యంలో అందరికీ దాన్ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నిస్తున్నారు. లాక్డౌన్లతో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే కంటే వ్యాక్సిన్లపై పన్ను ఎత్తేస్తే వచ్చే నష్టం తక్కువేనని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్నులను సడలించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

