12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్ | భారత్‌లో వైరస్ ఉధృతికి కారణంగా చెబుతున్న వేరియంట్‌పై తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని ఫైజర్ కంపెనీ తెలిపింది. B.1.617.2 వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ 87.9 శాతం సమర్థవంతంగా పని చేసిందని పేర్కొంది.

న్యూఢిల్లీ : భారత్‌లో వైరస్ ఉధృతికి కారణంగా చెబుతున్న వేరియంట్‌పై తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని ఫైజర్ కంపెనీ తెలిపింది. B.1.617.2 వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ 87.9 శాతం సమర్థవంతంగా పని చేసిందని పేర్కొంది. యూకేలో నిర్వహించిన అధ్యయనంలో 26శాతం మంది బ్రిటీష్ భారతీయులు పాల్గొన్నారని, అలాగే ఆసియాకు చెందిన పౌరులపై సైతం ట్రయల్స్ నిర్వహించినట్లు పేర్కొంది. 12 ఏళ్లు, అంతకు మించి వయస్సున్న వారి కోసం ఇచ్చేందుకు తమ వ్యాక్సిన్ సిద్ధమని, భారతీయులపై జరిపిన పరిశోధనల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది.
ఈ మేరకు భారత్‌లో అత్యవసర వినియోగానికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ఫైజర్ విజ్ఞప్తి చేసింది. వ్యాక్సిన్‌ను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నెల రోజుల వరకు నిల్వ చేయవచ్చని కూడా తెలిపింది. జూలై నుంచి అక్టోబర్ వరకు ఐదు కోట్ల డోసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిహారంతో పాటు పలు నిబంధనలు సడలించాలని సడలించాలని కోరుతోంది. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది.
ఈ మేరకు ఇటీవల వివిధ దేశాల్లో ఫైజర్ సమర్థతకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇచ్చిన ధ్రువపత్రాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇదిలా ఉండగా.. అమెరికాలోని మరో ఫార్మా దిగ్గజం మోడెర్నా ముంబైకి చెందిన సిప్లా కంపెనీతో కలిసి భారత్‌లో కొవిడ్ వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు వ్యాక్సిన్ల సరఫరాకు ముందుకు వచ్చిన ఫైజర్, మోడెర్నా కంపెనీలు.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా టీకాలు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. నేరుగా కేంద్ర ప్రభుత్వానికి టీకాలు అమ్ముతామని స్పష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి
మెహుల్ చోక్సీ దొరికాడు..
నల్లమలలో పుట్టిఎలుగు
ఈ వజ్రం ధర 213 కోట్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

