అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పుల్లో ఎనిమిది మంది చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పుల్లో ఎనిమిది మంది చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్‌జోన్‌లోని పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెనెన్స్ యార్డ్‌లో ఘటన జరిగింది. ఘటనలో నిందితుడు సైతం మరణించాడని పోలీసులు తెలిపారు. కాంపౌండ్ లోపల పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు బాంబ్ స్క్వాడ్స్‌ను మోహరించినట్లు శాంట్లాకార్లా కౌంటీ షెరీఫ్ డెప్యూటీ రస్సెల్ డేవిస్ పేర్కొన్నారు. కాల్పుల్లో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిందితుడిని వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ ఉద్యోగి 57 ఏళ్ల సామ్ కాసిడీగా గుర్తించారు. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. ఈ దుర్ఘటనపై వైట్‌హౌస్ డెప్యూటీ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియెర్ విచారం వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు చెప్పినట్లుగా.. దేశంలో తుపాకీ హింస అంటువ్యాధితో మేం బాధపడుతున్నామని స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తుపాకీ నియంత్రణ సంస్కరణలను ఆమోదించాలని అమెరికా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు, ఫైర్ సిబ్బంది శాన్‌జోన్‌లోని రైలు యార్డుకు సమీపంలోకి భారీగా చేరుకున్నారు. సిలికాన్ వ్యాలీ టెక్ హబ్‌గా ఉన్న ఈ ప్రాంతంలో స్థానిక సమయం ఉదయం 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు ముందు యూనియన్ సమావేశం జరిగిందని, ఆ సమయంలో కనీసం 80 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన వారంతా చికిత్స తీసుకుంటున్నారని శాన్‌జోస్ మేయర్ సామ్ లిక్కార్డో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నల్లమలలో పుట్టిఎలుగు
ఈ వజ్రం ధర 213 కోట్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

