అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కరెంట్, వర్షాలు లేక వరిపంట ఎండిపోయి అప్పు లు పెరిగిపోవడం తో మనస్తాపం చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. మెదక్ జిల్లా కొల్చారం మండల పోలీసుల వివరాల ప్రకారం.. కొల్చారం గ్రామానికి చెందిన రైతు పసుల సుధాకర్ (35) తనకున్న అర ఎకరంతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు.
- మెదక్ జిల్లా కొల్చారంలో ఘటన
కొల్చారం, నవంబర్ 29: కరెంట్, వర్షాలు లేక వరిపంట ఎండిపోయి అప్పు లు పెరిగిపోవడం తో మనస్తాపం చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. మెదక్ జిల్లా కొల్చారం మండల పోలీసుల వివరాల ప్రకారం.. కొల్చారం గ్రామానికి చెందిన రైతు పసుల సుధాకర్ (35) తనకున్న అర ఎకరంతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు.
కరెంట్ సక్రమంగా రాక, వర్షాలు లేక రెండెకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయింది. దీంతో పెట్టుబడి కోసం చేసిన రూ.3 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక సుధాకర్ కొద్దిరోజులుగా ఆందోళనకు గురయ్యాడు. కుటుంబ పోషణ సైతం భారంగా మారడంతో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొల్చారం ఎస్సై మొయినుద్దీన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

