దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు

కొలంబో: గతవారం కొలంబో తీరంలో అగ్నిప్రమాదానికి గురైన సింగపూర్ ఓడ మునిగిపోతున్నదని, దానివల్ల సముద్రంలోకి ఒలికే చమురు సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీలంక సముద్ర పర్యావరణ రక్షణ ప్రాధికార సంస్థ గురువారం ప్రకటించింది. సముద్ర పర్యావరణానికి జరిగిన నష్టంపై సంబంధింత పక్షాలపై పరిహారానికి దావా వేస్తామని సంస్థ అధికారి టర్నీ ప్రదీప్కుమార తెలిపారు. ఓడ సిబ్బందిని ప్రశ్నిస్తామని, వారి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని వివరించారు. అటార్నీ జనరల్ ద్వారా చట్టపరమైన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. గత మంగళవారం ఎంవీ ఎక్స్‌ప్రెస్ పెరల్ ఓడ నుంచి అగ్నిప్రమాద సంకేతాలు అందుకున్న తర్వాత భారత్, ఫిలిప్పీన్స్, చైనా, రష్యా దేశాలకు చెందిన 25 మంది సిబ్బందిని కాపాడారు. ఓడ నుంచి సముద్రంలోకి ఒలికిన చమురును సేకరించేందుకు ఏర్పాట్లు జరిగాయని, అవసరమైన సాధనసంపత్తిని సిద్ధంగా ఉంచామని ప్రదీప్ కుమార తెలిపారు. కొలంబో నుంచి మరవల వరకు పశ్చిమ తీరంలో కనిపిస్తున్న చమురు తాలూకు నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. పర్యావరణ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఓడ ట్ఆంకుల్లో 325 మెట్రిక్ టన్నుల ఇంధనం ఉంది. అది కాక ఓడపై 1,486 కంటేనర్లలో ప్రమాదకరమైన నైట్రిక్ యాసిడ్ ఉంది. గుజరాత్ లోని హజీరా రేవు నుంచి కొలంబోకు వాటిని తరలిస్తున్నారు. మంగళవారం సహాయం కోసం సంకేతాలు అందడంతో భారత తీర రక్షక దళం నౌకలు అండగా వెళ్లాయి. యూరోపియన్ యూనియన్ కు చెందిన నౌకలు సైతం సాయం చేసేందుకు వచ్చాయి. కానీ ప్రతికూల వాతావరణం, సముద్రపు పోటు కారణంగా వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

