e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 16, 2022
Home News చరిత్రలో ఈరోజు : విడిపోతున్నట్లు ప్రకటించిన ప్రిన్స్‌ చార్లెస్‌, డయానా దంపతులు

చరిత్రలో ఈరోజు : విడిపోతున్నట్లు ప్రకటించిన ప్రిన్స్‌ చార్లెస్‌, డయానా దంపతులు

Today History : దాంపత్య జీవితం నుంచి విడిపోతున్నట్లు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా 1992 లో సరిగ్గా ఇదే రోజున ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ జంట విడిపోవడాన్ని అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి జాన్ మేజర్ స్వయంగా ప్రకటించారు. విడాకులు ప్రకటించిన దాదాపు నాలుగేండ్ల తర్వాత 1996 ఆగష్టు 28 న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరి పెండ్లి మాదిరిగానే విడాకులు కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెండ్లైన కొన్నేండ్లకే ఈ రాచరిక జంట మధ్య సంబంధాలు క్షీణించిపోవడం ప్రారంభమయ్యాయి. భారతదేశం సందర్శనకు వచ్చినప్పుడు తాజ్‌మహల్‌ వద్ద ఒంటరిగా ఫొటోకు ఫోజులిచ్చినప్పుడే ఈ జంట విడిపోతున్న అనుమానం మరింత బలపడింది.

చార్లెస్-డయానాల విడాకుల మాదిరిగానే, వారి నిశ్చితార్థం, వివాహం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరి నిశ్చితార్థం 1981 ఫిబ్రవరి 24 న జరిగింది. నిశ్చితార్థంలో డయానా ధరించిన ఉంగరం విలువ 30 వేల పౌండ్లు (దాదాపు రూ.30 లక్షలు). ఆ ఉంగరంలో నీలమణితోపాటు 14 వజ్రాలను పొదిగారు. వీరి వివాహం 1981 జూలై 29 న జరిగింది. పెండ్లి నాటికి డయానా వయసు 20 ఏండ్లు. ఈ రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది టీవీలో వీక్షించారు. వీరి పెండ్లిని చూసేందుకు బ్రిటన్‌లోని కేథడ్రల్ నుంచి బర్మింగ్‌హామ్ ప్యాలెస్ వరకు 6 లక్షల మంది ప్రజలు గుమిగూడారు. వివాహమైన ఏడాది కాలంలో మొదటి బిడ్డ ప్రిన్స్ విలియమ్స్ జన్మనిచ్చారు. రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ ఉన్నాడు.

- Advertisement -

పెండ్లైన కొన్నేండ్లకే వీరి సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. 1992లో భారత్‌కు వచ్చిన యువరాణి డయానా.. తాజ్‌మహల్‌ ముందు ఒంటరిగా కూర్చొని ఫోటోకు పోజులిచ్చారు. ఇదే వారి సంబంధం ఎలా కొనసాగుతున్నదో తెలిపిందని చెప్పుకోవచ్చు. చివరగా విడాకుల ప్రకటన చేసిన నాలుగేండ్లకు విడాకులు తీసుకున్నారు. కాగా, ఇది జరిగిన ఏడాది తర్వాత 1997 ఆగస్టు 31న రోడ్డు ప్రమాదంలో డయానా మరణించింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2012: మెక్సికో విమాన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

2009 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం

2008: ఐరోపా ఉపగ్రహ వ్యవస్థల నిపుణుడు ఎడాం ఆస్ట్రియస్ కోసం ఉపగ్రహాన్ని రూపొందించిన ఇస్రో

2006: అణ్వాయుధ సామర్థ్యం గల మీడియం-రేంజ్ క్షిపణి ‘హాట్ఫ్-3 ఘజ్నవి’ని పరీక్షించిన పాకిస్తాన్‌

1998: శ్రీలంక పర్యటనలో భారతీయ బుకీ నుంచి లంచం తీసుకున్నట్లు అంగీకరించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు షేన్ వార్న్, మార్క్ వా

1946: న్యూఢిల్లీలోని రాజ్యాంగ మందిరంలో జరిగిన భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం

1941: జపాన్, జర్మనీ, ఇటలీపై యుద్ధం ప్రకటించిన చైనా

1758: భారతదేశంలో 13 నెలల సుదీర్ఘ మద్రాసు యుద్ధం ప్రారంభం

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా సోకితే ఊపిరితిత్తుల‌కు ప్ర‌మాద‌మా? ఎలా కాపాడుకోవాలి..?

మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!

ఒమిక్రాన్ పిల్ల‌లపై ప్ర‌భావం చూపిస్తుందా? ఈ వేరియంట్ ల‌క్ష‌ణాలేంటి?

ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement