హైదరాబాద్, మార్చి 10: డిస్ప్లే టెక్నాలజీ, సొల్యుషన్స్ సేవల సంస్థ బెన్క్యూ..తెలంగాణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కంపెనీ మొత్తం ఎల్సీడీ మానిటర్ల విక్రయాల్లో రాష్ట్రం వాటా 8 శాతంగా ఉన్నదని, అలాగే కిందటేడాదితో పోలిస్తే 2025లో 27 శాతం చొప్పున వృద్ధిన సాధించినట్లు బెన్క్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ తెలిపారు.
ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లో ఎల్సీడీ మానిటర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నదని, గతేడాదికాలంలో రెండంకెల వృద్ధి సాధించినట్టు చెప్పారు. కంపెనీకి చెందిన ప్రాజెక్టర్లు రూ.30 వేల నుంచి రూ.6 లక్షల లోపు లభిస్తుండగా, ఎల్సీడీ మానిటర్లను రూ.7,500 నుంచి రూ.20 వేల లోపు విక్రయిస్తున్నది.