Hema | హేమ వెళ్లిన పబ్‌పై మెరుపుదాడి… డ్రగ్స్ టెస్ట్ చేయగా, రిజల్ట్ ఏం వచ్చిందంటే..!
Hema | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నగరంలోని కొండాపూర్ ప్రాంతంలోని ఓ పబ్‌లో నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో పలువురికి పాజిటివ్ రావడం సంచలనానికి దారితీసింది. ఈ ఘటనలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ పేరు కూడా వినిపించడంతో, ఆమె స్పందన హాట్ టాపిక్‌గా మారింది.
Hema | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నగరంలోని కొండాపూర్ ప్రాంతంలోని ఓ పబ్‌లో నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో పలువురికి పాజిటివ్ రావడం సంచలనానికి దారితీసింది. ఈ ఘటనలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ పేరు కూడా వినిపించడంతో, ఆమె స్పందన హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో మొత్తం 64 మందికి పరీక్షలు చేయగా, అందులో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. వీరిలో ఆరుగురు గంజాయి వాడుతున్నట్టు, ఇద్దరు ఇతర డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ విషయం బయటకు రావడంతో నగరంలో మళ్లీ డ్రగ్స్ వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే ఈ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో హేమపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలపై వెంటనే స్పందించిన హేమ, తన డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్ వచ్చిందని స్పష్టంచేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ, “నేను పబ్‌కి వెళ్లాను. అక్కడ నా యూరిన్ శాంపిల్ తీసుకున్నారు. నా డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు. జెన్యూన్‌గా ఉంటుంది” అంటూ తన రిపోర్ట్ చూపించారు. దీంతో ఆమె అభిమానులు, ఫాలోవర్స్ నుంచి మద్దతు లభిస్తోంది.గతంలో కూడా బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ సందర్భంగా హేమపై డ్రగ్స్ వినియోగ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ కేసులో విచారణ అనంతరం ఆమెకు క్లీన్ చీట్ లభించింది. ఆ సమయంలో తాను తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని, అనవసర ఆరోపణల వల్ల చాలా బాధపడ్డానని హేమ వెల్లడించారు.
ఆ సమయంలో నరకం అనుభవించాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా నిందలు ఎదుర్కొన్నాను అంటూ ఆమె గతంలో భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజా ఘటన నేపథ్యంలో పోలీసులు పబ్‌లపై మరింత నిఘా పెంచినట్లు సమాచారం. డ్రగ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద, ఈ ఘటన మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారంపై ఆందోళన కలిగిస్తుంది. అయితే నటి హేమ తనపై వచ్చిన అనుమానాలకు వెంటనే స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actress
- Drugs Test
- hema
- lakshmi
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

