టెహ్రాన్: అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ విమానాన్ని(F-35 Fighter Jet) కూల్చినట్లు ఇరాన్ పేర్కొన్నది. సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఆ విమానం కూలినట్లు తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. పైలెట్ తీవ్రంగా గాయపడి ఉంటాడని, అతను బ్రతికి ఉండే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ కూల్చడం ఇది రెండో సారి అవుతుంది. అయితే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ మాత్రం దీనిపై ప్రకటన చేయలేదు. ఇప్పటికే అమెరికా గట్టి పోటీ ఇస్తున్న ఇరాన్.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రేడార్ డిటెక్షన్‌ను తప్పించుకునే స్టీల్త్ ఫైటర్ ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ కూల్చినట్లు వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చాలా కట్టదిట్టమైన భద్రత ఉండే వైమానిక క్షేత్రంలోనే ఎఫ్-35 ఫైటర్లు విహరిస్తుంటాయి.
Spokesman of Iran’s Khatam al-Anbiya Headquarters:
🔺 A second US fifth-generation F-35 was struck and downed over central Iran.
🔺 Given the massive explosion on impact and during the crash, the pilot is unlikely to have ejected. pic.twitter.com/8TX4jsbebw
— Mehr News Agency (@MehrnewsCom) April 3, 2026
ఇరాన్ మీడియా ప్రచురించిన ఫోటోలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ఉన్నవి ఎఫ్-35 శకలాలు కావు అని, ఆ పిక్స్ ఎఫ్-15ఈ ఫైటర్ జెట్‌కు చెందినవని ఏరోస్పేస్ నిపుణులు అంటున్నారు. ఇరాన్ చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు అమెరికా స్పందించలేదు.
రెండు వారాల క్రితం కూడా ఎఫ్-35 లైటనింగ్ 2 విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అమెరికా ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ సామర్థ్య ఆయుధాల్లో ఈ ఫైటర్ జెట్ కూడా ఒకటి. గతంలో జరిగిన సంఘటన గురించి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఓ ప్రకటన చేశారు. కంబాట్ మిషన్‌లో పాల్గొన్న ఆ ఫైటర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించినట్లు ఆయన చెప్పారు. కానీ ఐఆర్జీసీ ఎఫ్-35 కూల్చివేతకు చెందిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.