హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు. ఒక్కొక్క ఇంటి కి రూ.5 లక్షల వ్యయంతో 118 పట్టణాల్లో 18,213 ఇండ్లను నిర్మించడానికి ఆమోదించినట్టు తెలిపారు. పీఎంవైఏ 2.0 పథకం సెంట్రల్ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని వివరించారు. 118 పట్టణాల్లో మొత్తం రూ.910.65 కోట్లలో కేంద్రం వాటాగా రూ. 273.20 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ. 637.45 కోట్లు అంచనా వేసినట్టు ఆయన తెలిపారు.