ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలకాలంలో పైలెట్ల కొరతతో భారీగా విమాన సర్వీసులు రద్దు చేసిన మూడు నెలల తర్వాత ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
దీంతో కంపెనీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ భాటియాకు సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది సంస్థ. నూతన సీఈవోగా నియమితులయ్యే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.