Inter Exams | ఇంటర్ ఫిజిక్స్ పేపర్లో తప్పిదం.. తెలుగు మీడియం వారికి ఒకలా.. ఇంగ్లిష్ మీడియం వారికి మరోలా!
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. ఫిజిక్స్ పేపర్-2లో తప్పిదం చోటుచేసుకున్నది. ఇంగ్లిష్ మీడి యం వారికి ఒకలా.. తెలుగు మీడియం వారికి మరోలా ప్రశ్నలు ఇచ్చారు.
Inter Exams | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. ఫిజిక్స్ పేపర్-2లో తప్పిదం చోటుచేసుకున్నది. ఇంగ్లిష్ మీడి యం వారికి ఒకలా.. తెలుగు మీడియం వారికి మరోలా ప్రశ్నలు ఇచ్చారు. ప్రశ్నపత్రంలోని 21వ ప్రశ్నలో ఈ పొరపాటు జరిగింది. తెలుగు మీడి యం ప్రశ్నపత్రంలో 8 మార్కుల ప్రశ్నతోపాటు, 2 మార్కుల ప్రశ్నను కలిపి ఆడిగారు. ఇంగ్లిష్ మీడియంలో 8 మార్కుల ప్రశ్నమాత్రమే ఇచ్చా రు.
తెలుగు మీడియం పేపర్లో ‘చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రము, పనిచేసే విధానాన్ని వివరించండి’, ‘ఒకానొక పరమాణు బాంబు విస్ఫోటంలో ఒక మైక్రోగ్రామ్ యురేనియం సంపూర్ణంగా నాశనమైతే ఎంత శక్తి విడుదలవుతుంది’? అన్న ప్రశ్న ఇచ్చారు. రియాక్టర్‌కు సంబంధించిన ప్రశ్న 8 మార్కులది కాగా, పరమాణు బాంబుకు సంబంధించినది రెండు మార్కుల ప్రశ్న.
అదే ఇంగ్లిష్ మీడియంలో 21వ ప్రశ్నను కేవలం Explain the principle and working of a nuclear reactor with help of a labelled diag ram (చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రము, పనిచేసే విధానాన్ని వివరించండి) అని మాత్రమే ఇచ్చారు. తెలుగు మీడి యం వారు మొత్తం సమాధానం రాయగా, ఇంగ్లి ష్ మీడియం వారు సగం సమాధానం రాసి వదిలేశారు. దీనిపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆది త్య మాట్లాడుతూ.. తప్పిదం జరిగిందని, తెలుగు మీడియంలో రాసే వారు తక్కువగా ఉన్నారని, 8 మార్కుల ప్రశ్న వరకు సమాధానం రాస్తే సరిపోతుందని వివరించారు. మూల్యాంకనం చేసేటప్పుడు దీనిపై జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.మంగళవారం 9 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.

Physics
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

