సోమవారం 03 ఆగస్టు 2020
Food - Jul 02, 2020 , 16:36:46

పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!

పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం స‌రిగా లేకుంటే సిరి సంప‌ద‌లు ఎన్ని ఉన్నా వేస్టే క‌దా.. అందుకే ఆరోగ్యంగా ఉండ‌మ‌ని నిపుణులు ప‌దే ప‌దే చెబుతుంటారు. అలా ఉండాలంటే ఆకుకూర‌లు ఎక్కువ‌గా తినాలి. అందులో పాల‌కూత ప్ర‌త్యేకం. వారానికి ఒక‌సారి పాల‌కూర తింటే పెద్ద రోగాల‌ను సైతం త‌రిమికొట్టొచ్చు అంటున్నారు వైద్యులు. అస‌లు పాల‌కూర‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

* పాల‌కూర‌లో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది. త‌ర‌చూ పాల‌కూర‌ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. 

* దీనివ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం కూడా దూరం అవుతుంది. 

* బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి పాల‌కూర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

* అన్నింటి క‌న్నా ముఖ్యంగా పాల‌కూర క్యాన్స‌ర్‌కు దూరంగా ఉంచుతుంది. అందుకే దీనిని ప్ర‌తిరోజూ తినాల‌ని సూచిస్తున్నారు వైద్యులు.

* అలాగే గుండె స‌మ‌స్య‌లు రాకుండా చేస్తుంది.  

* పాల‌కూర నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా చేస్తుంది. 

* క‌రోనా స‌మ‌యంలో పాల‌కూర ఎక్కువ‌గా తిని రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. 

* దీనివ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. అంతేకాదు శ‌రీరానికి ఆక్సిజ‌న్ అందేలా చూస్తుంది. 

* కండ‌రాల స‌మ‌స్య ఉన్న‌వాళ్లు పాల‌కూర తిన‌డం మంచిది. ఇది తిన‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. 

* గర్భిణీ మ‌హిళ‌లు పాల‌కూర‌ తింటే ఆరోగ్యంగా ఉంటారు. 

 logo