వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్ | పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలైనప్పటి నుంచి కూడా దానిపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సినిమాను రాజకీయ కోణంలో చూస్తున్నారు అంటూ అభిమానులు కూడా విమర్శిస్తున్నారు.

ఎందుకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలైనప్పటి నుంచి కూడా దానిపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారు. ఇది బయటకు చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది కూడా. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సినిమాను రాజకీయ కోణంలో చూస్తున్నారు అంటూ అభిమానులు కూడా విమర్శిస్తున్నారు. సినిమాను సినిమాలా చూడాలి కానీ వ్యక్తిగతంగా తీసుకొని రాజకీయ కక్ష సాధింపు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అక్కడ టికెట్ల రేట్లు పెంపుపై విషయం కోర్టు వరకు వెళ్లింది. ఎప్పుడో విడుదలైన సినిమాలకు 150 రూపాయల టికెట్లు ఉంటే మొన్న విడుదలైన వకీల్ సాబ్ సినిమాకు మాత్రం 110 రూపాయల టికెట్ ఉంది. దీనివల్ల కలెక్షన్లపై కూడా చాలా ప్రభావం పడుతుంది.ఇదంతా ఇలా ఉంటే తాజాగా వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు బాగా ఆడుతున్న థియేటర్లను సీజ్ చేశారు అధికారులు. అయితే ఇది జరిగింది మన రాష్ట్రంలో కాదు.. శ్రీకాకుళం సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రంలోని పర్లకిమిడి అనే ఊరిలో జరిగింది. పేరుకు ఒడిశా కానీ అక్కడ తెలుగు సినిమాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాలు కావడంతో మన హీరోల సినిమాలకు అక్కడ కూడా క్రేజ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు అక్కడ అభిమాన సంఘాలు ఉన్నాయి. వాళ్ల సినిమాలు విడుదలైతే పండగ వాతావరణం ఉంటుంది.
అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైన కారణంగా అక్కడ థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది ఖాతరు చేయకుండా హౌస్ ఫుల్ టికెట్స్ అమ్మడంతో.. సమాచారం అందుకున్న అధికారులు జై మా, లక్ష్మి థియేటర్లను సీజ్ చేశారు. దాంతో పాటు అదనంగా 10 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
కేటీఆర్ సర్.. మీరు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా?
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
హీరోయిన్‌పై నెమలి దాడి.. వీడియో వైరల్
పవర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువరత్న
దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

