ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్

మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మే 28న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం సన్నివేశాలతో చిత్రంపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. రవితేజ రెండు పాత్రలలో కనిపించి ఆకట్టుకున్నాడు.
రవితేజ ఎనర్జీ, బాడీ లాంగ్వేజీకి తగినట్లుగా ఈ సినిమాని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తుండగా, అందాల యాంకర్ అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. మే 28న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

