వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..
వకీల్ సాబ్ | సాధారణంగా తెలుగు సినిమాల్లో మన హీరోలు అలాంటి భాష వాడరు. ప్రత్యేకించి ఒక నేపథ్యం ఉంటే తప్ప.

పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. అలాగే ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. తన ఇమేజ్‌కు సరిపోయేలా అద్భుతమైన కథను ఎంచుకున్నాడు అంటూ పవన్ కళ్యాణ్‌ను పొగిడేస్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా పవర్ ఫుల్ కం బ్యాక్ అంటూ పవన్ కళ్యాణ్ నటనను ఆకాశానికి ఎత్తేశాడు. కమర్షియల్‌గా కూడా వకీల్ సాబ్ దూసుకుపోతున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా ఈ సినిమా సంచలన వసూళ్లు నమోదు చేసింది. ఇదంతా ఇలా ఉంటే వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో మాట్లాడుతాడు. సాధారణంగా తెలుగు సినిమాల్లో మన హీరోలు అలాంటి భాష వాడరు. ప్రత్యేకించి ఒక నేపథ్యం ఉంటే తప్ప తెలంగాణ యాస మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ భాష మాట్లాడటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దానికి ప్రత్యేకంగా కారణం ఏదైనా ఉందా అని దర్శక నిర్మాతలను మీడియా మిత్రులు అడిగారు. దీనికి చిత్రయూనిట్ నుంచి కూడా ఆసక్తికరమైన సమాధానం వచ్చింది.

ఈ సినిమాలో పవన్ తెలంగాణ యాస మాట్లాడటానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని.. తాము తెలంగాణ నుంచి వచ్చాము కాబట్టి ఈ సినిమాలో కూడా అదే భాషను చూపించామని దర్శకుడు శ్రీరామ్ వేణు చెప్పాడు. ఈయన కరీంనగర్ నుంచి వచ్చాడు. అలాగే నిర్మాత దిల్ రాజుది నిజామాబాద్. ఇద్దరు కేరాఫ్ తెలంగాణ కావడంతో సినిమాలో హీరోతోనూ కూడా తెలంగాణ యాస మాట్లాడించారు. అంతేగాని ప్రత్యేకంగా కారణాలు మాత్రం లేవు. కోర్టు సన్నివేశాల్లో పవన్ మాట్లాడే భాష కితకితలు పెడుతుంది. మొత్తానికి పవర్ స్టార్ లాంటి హీరో తెలంగాణ యాస మాట్లాడటంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హోంక్వారంటైన్లో ‘వకీల్‌సాబ్’
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్.. రిలీజ్ ఆపేయాలని ఫిర్యాదు
అండర్ వాటర్‌లో మెహరీన్‌కు ప్రపోజ్- వీడియో వైరల్
బీచ్‌లో దిశా పటాని బికినీ షో.. వైరల్‌గా మారిన ఫొటో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
‘వకీల్ సాబ్’ సినిమాపై పూనమ్ కౌర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
ఇదెక్కడి పిచ్చి అభిమానం.. పవన్ ఫ్యాన్ పై అనసూయ ఆగ్రహం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

