పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్

అనుకున్నట్లుగానే కరోనా వైరస్ ను కూడా పవన్ కళ్యాణ్ సినిమా పక్కనబెట్టేసింది. తొలిరోజు ‘వకీల్ సాబ్’ సంచలన వసూళ్లు సాధించింది. ఈ చిత్ర తొలిరోజు వసూళ్లు కాస్త ఆలస్యంగా బయటికి వచ్చాయి. అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లను తీసుకొచ్చింది వకీల్ సాబ్ సినిమా. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఫస్టాఫ్ కాస్త యావరేజ్ గానే ఉన్నా సెకండాఫ్ సినిమాను నిలబెట్టింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుండటంతో వకీల్ సాబ్ రచ్చ చేస్తున్నాడు. ఈ సినిమా తొలిరోజు ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..
నైజాం- 8.75 కోట్లు
సీడెడ్- 4.50 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.85 కోట్లు
ఈస్ట్- 3.10 కోట్లు
వెస్ట్- 4.50 కోట్లు
గుంటూరు- 3.94 కోట్లు
కృష్ణా- 1.90 కోట్లు
నెల్లూరు- 1.70 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 32.24 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.82 కోట్లు
ఓవర్సీస్- 2.40 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 36.46 కోట్లు
వకీల్ సాబ్ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం 90 కోట్లు షేర్ వసూలు చేయాలి. అంటే మరో 53 కోట్ల దూరంలో ఉన్నాడు పవర్ స్టార్. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లు.. కర్ణాటక, ఓవర్సీస్ కలిపి 4 కోట్లకు పైగా తీసుకొచ్చింది వకీల్ సాబ్. కోవిడ్ సమయంలో కూడా ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థం అయిపోతుంది. రెండో రోజు కూడా వకీల్ సాబ్ కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

