‘వకీల్ సాబ్’ సినిమాపై పూనమ్ కౌర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంటే కూడా ఇప్పుడు దాన్ని రాజకీయాలు చేస్తున్నారు కొందరు. ఈయన వకీల్ సాబ్ సినిమాను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు మరికొందరు. మరోవైపు ఈ సినిమాను ఎలాగైనా తమ రాజకీయ పలుకుబడితో అడ్డుకోవాలని ఇంకొందరు ఆలోచిస్తున్నారు. అయితే అందరి మధ్య వకీల్ సాబ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. టాక్ కూడా బాగుండటంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో వకీల్ సాబ్ సినిమాపై కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. వకీల్ సాబ్ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పవన్ సినిమాపై తమ అభిప్రాయాలను రాసుకొస్తున్నారు. అందులో ఇప్పుడు పూనమ్ కౌర్ కూడా ఇదే చేసింది.
పవన్ కళ్యాణ్ పేరుతోనే ఈమె ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో వకీల్ సాబ్ సినిమాను ఉద్ధేశించి కొన్ని కామెంట్స్ చేసింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరైనా చూసినా ఎంకరేజ్ చేయాలి కానీ.. పక్కా ప్లానింగ్ ప్రకారం డీ ఫేమ్ చేయడం ఏంటో..? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్లు రాజకీయాలు..? అమ్మాయిలను డీ ఫేమ్ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు.. అమ్మాయిలను రక్షించే సినిమాలు తీస్తే ప్రాబ్లమ్ ఎవరికి..? ప్రెస్ మీట్ పోసాని గారు..? అంటూ పోస్ట్ చేసింది. సినిమాలు, రాజకీయాలకు మధ్య అరెంజడ్ మ్యారేజ్ రిలేషన్ ఉంటుంది.. కలిసుండరు.. ఉండనివ్వరు.. కాపురం చేయకపోతే చూస్తున్న జనం ఫీల్ అవుతారు.. కుళ్లు రాజకీయాలు మానేయాలి అంటూ పూనమ్ చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎవర్ని ఉద్దేశ్యించి ఇలాంటి పోస్టులు పూనమ్ కౌర్ పెట్టిందబ్బా అంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

