ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు | తొలి సినిమా హిట్ అయినా కూడా చాలా మంది దర్శకులకు రెండో సినిమాతో బ్రేకులు పడ్డాయి. అందుకే బుచ్చిబాబు కూడా తన రెండో సినిమాకు చాలా కేర్ తీసుకుంటున్నాడు

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి నిజంగానే ఉప్పెనలా దూసుకొచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సన. సుకుమార్ శిష్యుడిగా వచ్చిన ఈయన గురువు పేరు నిలబెట్టాడు. తొలి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు. ఉప్పెన లాంటి బోల్డ్ కథను ప్రేక్షకులను నచ్చేలా చెప్పడం నిజంగానే గొప్ప విషయం. ఈ విషయంలో 100 శాతం సక్సెస్ అయ్యాడు బుచ్చిబాబు. ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత చాలా మంది హీరోలు ఈయనతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాతలు అయితే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కోసం క్యూ కడుతున్నారు. ఈయన మాత్రం రెండో సినిమా కోసం చాలా జాగ్రత్తగా ఉన్నాడు.

ఎందుకంటే తొలి సినిమా హిట్ అయినా కూడా చాలా మంది దర్శకులకు రెండో సినిమాతో బ్రేకులు పడ్డాయి. అందుకే బుచ్చిబాబు కూడా తన రెండో సినిమాకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఈయన కథ చెప్పాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన సైడ్ బిజినెస్ మాత్రం అదిరిపోయింది. ఏం బిజినెస్ చేస్తున్నాడబ్బా అనుకుంటున్నారా..? యూ ట్యూబ్ లో పిచ్చెక్కిస్తున్నాడు బుచ్చిబాబు.

వరస వీడియోలతో అక్కడ రచ్చ చేస్తున్నాడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు . ఉప్పెన మేకింగ్ వీడియోలతో పాటు అక్కడ జరిగిన కొన్ని ఆసక్తికరమైన వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. రోజూ కచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాడు ఈయన. ప్రతి వీడియోకు కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పెన లొకేషన్స్ లో జరిగిన సరదా సంఘటనలను వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నాడు బుచ్చి. ఈయనకు సబ్ స్క్రైబర్స్ కూడా బాగానే పెరిగిపోతున్నారు. యూ ట్యూబ్ బిజినెస్ లో బాగానే దూసుకుపోతున్నాడు బుచ్చిబాబు. ఇదంతా చూసి ఉప్పెన దర్శకుడి సైడ్ బిజినెస్ అదిరిపోతుందిగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
హోంక్వారంటైన్లో ‘వకీల్‌సాబ్’
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్.. రిలీజ్ ఆపేయాలని ఫిర్యాదు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదట!
అండర్ వాటర్‌లో మెహరీన్‌కు ప్రపోజ్- వీడియో వైరల్
బీచ్‌లో దిశా పటాని బికినీ షో.. వైరల్‌గా మారిన ఫొటో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
‘వకీల్ సాబ్’ సినిమాపై పూనమ్ కౌర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
ఇదెక్కడి పిచ్చి అభిమానం.. పవన్ ఫ్యాన్ పై అనసూయ ఆగ్రహం
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

