కేటీఆర్ సర్.. మీరు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి మనందరికి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆయన #AskKTR పేరుతో ఓ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓ నెటిజన్ పైన కనిపిస్తున్న ఫొటో షేర్ చేస్తూ.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడు ప్రయత్నించలేదా అని అడిగాడు. దీనికి కేటీఆర్..బాలీవుడ్, హాలీవుడ్డా.. మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావు అంటూ స్మైలింగ్ ఎమోజీని జత చేసి ట్వీట్ చేశారు.
ఇక మరో నెటిజన్.. ఇటీవల మీరు చూసిన చిత్రం ఏంటని ప్రశ్నించగా, దానికి జాతిరత్నాలు అని బదులిచ్చారు కేటీఆర్. ఆ సినిమా చాలా నచ్చిందని అన్నారు. జాతి రత్నాలు చిత్రం .. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందగా, మహా శివరాత్రి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేశారు. ఏప్రిల్ 11 నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఆస్క్ కేటీఆర్ సెషన్లో పాల్గొన్న థమన్.. తెలంగాణలో అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం మంచి గాయకులు, సంగీతకారులతో పాట చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. అందుకు కేటీఆర్ బదులిస్తూ… అద్భుతమైన ఆలోచన బ్రదర్ అంటూ ప్రోత్సహించారు.
Loved Jathi Rathnalu. Was hilarious 😆 https://t.co/8UwRkxpzmg
— KTR (@KTRBRS) April 11, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jathi Ratnalu
- KTR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

