Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ సినిమాకు మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, పశుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం (Mahabharat) కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. అయితే తాజాగా ఈ సినిమా కన్నడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ కన్నడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను శాండల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవిన్ ప్రోడక్షన్స్ (KvnProductions) భారీ ధరకు దక్కించుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఎంత ధరకు దక్కించుకున్నారు అనేది మాత్రం చిత్రబృందం వెల్లడించలేదు. ఇక సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Get ready to dive into the FUTURE 💥#Kalki2898AD Karnataka Release by @KvnProductions, grand release on June 27th, 2024!#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @SUPRITH_87 #Kalki2898ADonJune27 pic.twitter.com/viL20T1BPv
— Vamsi Kaka (@vamsikaka) May 10, 2024