Viral Video | ఇన్విజిబుల్ పానీ పూరిపై నెటిజన్ల నెక్ట్స్ లెవెల్ రియాక్షన్
Viral Video : దేశీ ఫుడ్ లవర్స్‌కు పానీ పూరి అంటే కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు ఇది వారికి ఓ ఎమోషన్ కూడా..అందుకే అందరికీ ఇష్టమైన పానీ పూరి తరచూ పలు ప్రయోగాలకు కేరాఫ్‌గా మారింది.
Viral Video : దేశీ ఫుడ్ లవర్స్‌కు పానీ పూరి అంటే కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు ఇది వారికి ఓ ఎమోషన్ కూడా..అందుకే అందరికీ ఇష్టమైన పానీ పూరి తరచూ పలు ప్రయోగాలకు కేరాఫ్‌గా మారింది. ఈ రెసిపీతో చిత్రవిచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ నెట్టింట సందడి చేస్తుంటాయి. ఇక తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత ఇన్విజిబుల్ పానీ పూరితో ముందుకొచ్చారు. బెంగళూర్‌లోని ఓ గోల్గప్ప విక్రేత కలర్‌లెస్ వాటర్‌తో పానీ పూరి విక్రయిస్తున్న వీడియోను ఓ ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వాటర్ భిన్నమైన ఫ్లేవర్స్‌తో స్పైసీ టేస్ట్ కలిగిఉంది. ఈ వీడియోలో జార్లో సెమీ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ కనిపిస్తుంది. ఆపై విక్రేత దాన్ని ఓ డిస్పోజబుల్ గ్లాస్‌లోకి తీసుకోవడం చూడొచ్చు. ఆ లిక్విడ్‌ను టేస్ట్ చేస్తూ నాకోసం స్పైసీ..స్పైసీ అనడం వినిపిస్తుంది. ఇక అందులోని నీటిని పూరీల్లో నింపుతూ వాటిని ఆస్వాదించడంతో వీడియో ముగుస్తుంది.
ఈ వీడియోను షేర్ చేస్తూ బెంగళూర్‌లో అత్యంత రుచికరమైన గోల్గప్ప.. ఇన్విజిబుల్ వాటర్‌తో పానీపూరి అని వ్లాగర్ రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెట్టింట పెద్దసంఖ్యలో యూజర్లు రియాక్టయ్యారు. నీటిలో వెనిగర్‌ను వాడటం వల్లే అది కలర్లెస్గా ఉందని ఈ డిష్‌ను ఇప్పటికే టేస్ట్ చేసిన యూజర్లు కొందరు కామెంట్ చేశారు. దీన్ని బంగార్పేట్ పానీ పూరి అని పిలుస్తారని మరో యూజర్ రాసుకొచ్చారు. ఈ ఫుడ్ కాంబినేషన్ తమకు నచ్చలేదని మరికొందరు కామెంట్ చేశారు. ఇది అసలు ఏమాత్రం రుచిగా లేదు..డబ్బులు దండగ అని ఓ యూజర్ తేల్చేశారు. ఇది బాగా లేదని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Thangalaan | బాక్సాఫీస్ క్రేజీ ఫైట్ ఆన్ ది వే.. తంగలాన్ వర్సెస్ రాయన్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

